సభ జరిగింది. జేఏసీ నిర్వహించిన ఈ సభకు అధికార వైసీపీ మద్దతు ప్రకటించింది.
న్యాయ రాజధానితోనే సీమకు న్యాయం జరుగుతుందని జేఏసీ అధ్యక్షుడు
విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ
రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. సోమవారం ఉదయం 10
గంటలకు కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు
ప్రజలు భారీగా తరలివచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు
ఏర్పాటు చేయాలని మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం,
ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి
పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులు పిలుపునిచ్చారు. ఆరు
దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక
ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంకల్పించినందుకు జెఏసి అధ్యక్షుడు
విజయ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నీకు ఇష్టం లేదా చంద్రబాబూ: మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్
శతాబ్దాల తరబడి కరువు కాటకాలను ఎదుర్కొన్న ప్రాంతం రాయలసీమని మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నీకు ఇష్టం
ఉందా లేదా అని చంద్రబాబునను సూటిగా ప్రశ్నించారు. “వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో
7500 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు రాయలసీమకు వచ్చాయి. లా యూనివర్సిటీ రాయలసీమలో
ఏర్పాటు చేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలను
అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ,
శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన మేరకు నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం
తీసుకున్నారు. సమానమైన, సమతుల్యమైన అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ జరగాలి”
అని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.
14 సంవత్సరాల సీఎం చంద్రబాబు రాయలసీమకికు ఏమి చేశాడు: మంత్రి పెద్దిరెడ్డి
రాయలసీమ ప్రాంతంలో నుంచి వచ్చిన ముఖ్యమంత్రులతో పాటు 14 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఒక్క హైదరాబాద్ తప్ప ఇక ఏ ప్రాంతాన్నీ
అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని చెప్పి వికేంద్రీకరణ అనే సిద్ధాంతాన్ని
సీఎం జగన్ ముందుకు తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. చంద్రబాబును రాయలసీమ
ద్రోహగా పరిగణించాలని ప్రజలను పెద్దిరెడ్డి కోరారు.
సీమ వెనుకబాటుకు న్యాయ రాజధానితోనే న్యాయం: జేఏసీ అధ్యక్షుడు
విజయ్‌కుమార్‌రెడ్డి
“కర్నూలును ఆంధ్రప్రదేశ్‌కు న్యాయ రాజధానిగా చేయాలనే నిర్ణయం ఇప్పటికి అత్యంత
అవసరం. పదే పదే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అన్ని రంగాల్లో
అభివృద్ధి చెందకుండా పోయింది. ఒకప్పుడు సంపన్న ప్రాంతంగా పేరుగాంచిన ప్రాంతం
ఇప్పుడు వెనుకబడిన ప్రాంతంగా నిలిచింది. వ్యవసాయం, పారిశ్రామికీకరణ వంటి
రంగాల్లో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు
పెరిగాయి. ఈ సమస్యలన్నింటికీ ముగింపు పలికేందుకు న్యాయ రాజధానిని ఇక్కడే
ఏర్పాటు చేయడం సముచితమ”ని జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా, వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న
నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే
ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు
రాజధానిగా ఉండేది. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా,
అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మకంతోనే
ఆంధ్రరాష్ట్ర సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగుకు
శంకు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా
కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని,
గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదుకు
తరలించబడింది. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది.
అనంతరం కొన్ని దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం
పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని
మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని
కన్వీనర్ డాక్టర్ సతీష్, పుల్లయ్య, రవీంద్ర, కె.వి సుబ్బారెడ్డి, కె.
శ్రీనివాస్ రెడ్డి తదితర జెఏసి నాయకులు కోరారు.