వరుస విజయాలతో నెదర్లాండ్స్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో యూఎస్ఏపై నెగ్గి
క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శనివారం జరిగిన తొలి
ప్రిక్వార్టర్స్ పోరులో నెదర్లాండ్స్ 3-1 తేడాతో అమెరికాపై అద్భుత విజయం
సాధించింది. డచ్ జట్టు తరఫున మెంఫిస్ డెపె(10ని), డాలీ బ్లైండ్(45+ని),
డెంజెల్ డమ్‌ఫ్రైస్(81ని) గోల్స్ అందించారు. హజీ రైట్(76ని) అమెరికాకు
ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ పదో నిమిషంలో సహచరుల నుంచి 21పాస్‌ల ద్వారా
బంతిని అందుకున్న మెంఫిస్ కండ్లు చెదిరే రీతిలో గోల్ కొట్టాడు. దీంతో డచ్
టీమ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రథమార్ధం మరికొద్దిసేపట్లో
ముగుస్తుందనగా డాలీ బ్లైండ్..అమెరికా రక్షణ శ్రేణిని కంగుతినిపిస్తూ గోల్
కొట్టాడు. అమెరికా డిఫెండర్లు నిశ్చేష్టులైన వేళ బ్లైండ్ కొట్టిన గోల్
మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మ్యాచ్ 76వ నిమిషంలోడచ్ డిఫెన్స్‌ను
ఛేదిస్తూ రైట్ గోల్ చేయడంతో స్కోరు 1-2కు చేరింది. కానీ, అమెరికా ఆశలు
ఎక్కువసేపు నిలువలేదు. ఐదు నిమిషాల వ్యవధిలో డమ్‌ఫ్రైస్ చాకచక్యంగా గోల్
చేయడంతో నెదర్లాండ్స్ గెలుపొందింది.