కర్ణాటకలోని పాఠశాల సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్
రాజ్‌కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని అక్కడ ప్రభుత్వం
నిర్ణయించింది. పునీత్ రాజ్‌కుమార్ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని
వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తాము ఆ దిశగా ఆలోచన
చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. పునీత్
రాజ్‌కుమార్ వందలాది మంది నిరుపేద విద్యార్థులను, అనాధలను తన సొంత ఖర్చుతో
చదివించి గొప్ప మానవతా మూర్తిగా నిలిచారని, ఆయన జీవితచరిత్ర నుంచి
విద్యార్థులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్ణాటకకు చెందిన
పలువురు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు.