ఢాకా వేదికగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్
కోసం అక్కడికి న్యూజీలాండ్ నుంచి నేరుగా చేరుకున్న టీమ్ ఇండియా క్రికెటర్
దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన
విమానంలో అతను అక్కడికి చేరుకున్నాడు. అయితే, ఎయిర్‌లైన్స్ సిబ్బంది
నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజి మాత్రం ఢాకాకు రాలేదు. ఈ క్రమంలో
అసహనానికి గురైన చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
వ్యక్తం చేశాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్
వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ఫుడ్ కూడా లేదు.. ”మలేషియా
ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం
ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో
ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం అందజేయలేదు. మాతో పాటు లగేజ్ కూడా
రాలేదు. 24 గంటల నుంచి లగేజ్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా
లగేజీ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్ధం అవుతాను” అని చాహర్
ట్విటర్లో పేర్కొన్నాడు.