ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురై
తిరిగి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. స్వల్ప అనారోగ్యం
అనంతరం శనివారం ఉదయం తిరిగి ఎంతో ఉత్సాహంగా కామెంట్రీ విధుల్లోకి వచ్చానని
పాంటింగ్ స్వయంగా వెల్లడించడం విశేషం. ‘బహుశా నేను నిన్న చాలా మందిని భయపెట్టి
ఉంటాను. నిజం చెప్పాలంటే.. నాకు కూడా అది భయంకరమైన క్షణమే. అయితే, ఈ ఉదయం
నాకెంతో గొప్పది. షైనీ అండ్ న్యూ’ అంటూ పాంటింగ్ కామెంట్రీ ప్రారంభించినట్లు
ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఈ వార్తతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం
చేస్తున్నారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న
టెస్టు మ్యాచ్ లో పాంటింగ్.. ఛాతిలో నొప్పి కారణంగా కామెంట్రీ బాక్స్ నుంచి
వేగంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.