పాకిస్థాన్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు
రికార్డుల మోత మోగించారు. ఒకరిద్దరు కాదు..ఏకంగా నలుగురు ఆటగాళ్లు శతకాల మోత
మోగించారు. వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు ఆట ఆపివేసే సమయానికి ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులతో ప్రపంచ రికార్డు
నెలకొల్పింది. దాంతో ఎప్పుడో..112 ఏళ్ల కిందట అంటే 1910లో టెస్ట్ మ్యాచ్
మొదటి రోజు అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా రికార్డు బద్దలైంది. జాక్
క్రాలీ (111 బంతుల్లో 122), బెన్ డకెట్ (110 బంతుల్లో 107), ఓలీ పోప్ (104
బంతుల్లో 108), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో కదం
తొక్కారు. స్టార్ పేసర్ అఫ్రీది గాయపడడంతో ముగ్గురు అరంగేట్ర బౌలర్లు
హారిస్ రౌఫ్, మహ్మద్ అలీ, లెగ్ స్పిన్నర్ జహీద్తో పాక్ బరిలో దిగింది.
506 పరుగులు ఓ టెస్ట్ తొలిరోజు ఆటలో అత్యధికం. ఇక చరిత్రను చూస్తే…ఓ
టెస్ట్‌లో ఏదేని ఒక రోజు ఆటలో 500కు పైగా పరుగులు నాలుగు సార్లు చేశారు.
ఇంగ్లండ్ జట్టు 1936లో భారత్‌తో జరిగిన టెస్టు రెండోరోజు ఆటలో 588 రన్స్
చేసింది. ఏ వికెట్‌కైనా ఇప్పటికీ అదే రికార్డు. టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు
నలుగురు బ్యాటర్లు సెంచరీ చేయడమూ రికార్డే. క్రాలీ, డకెట్ 35.4 ఓవర్లలో 6.53
రికార్డు సగటుతో తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు. బర్న్స్, వార్నర్
(2015లో కివీస్ పై 6.29 సగటు), గ్రేమ్ స్మిత్, డివిల్లీర్స్ (2005లో
జింబాబ్వేపై 6.22 సగటు) ఆరుకుపైగా సగటుతో మొదటి వికెట్‌కు డబుల్ సెంచరీ
భాగస్వామ్యం నెలకొల్పారు. అరంగేట్రం బౌలర్ సాద్ షకీల్ బౌలింగ్ బ్రూక్ 6
ఫోర్లు కొట్టాడు. టెస్ట్‌ల్లో ఒక ఓవర్లో ఈ ఫీట్ సాధించిన ఐదో
బ్యాటర్ బ్రూక్.