రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచనుంది.
కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తోంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని
వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి
ప్రవేశపెట్టడానికి సమాయాత్తమౌతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ
అప్పట్లో సభలో జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా
కార్యాచరణలోకి దిగారు.
సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో..
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాలు కూడా వైసీపీ ప్రభుత్వానికి
కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆరు నెలల్లోగా రాజధాని అమరావతిని అభివృద్ధి
చేయాలంటూ ప్రభుత్వానికి గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు
తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేయడానికి కోర్టులు
టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావని కీలక వ్యాఖ్యలు చేసింది.
కేంద్రం సైతం..
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని,
వాటి సంఖ్యను పెంచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇదివరకే స్పష్టం చేసిన
విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. రాజ్యసభలోనూ
దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలనేది
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.
అడ్డంకులు కలగని విధంగా..
ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు రూపకల్పనకు
తుదిరూపాన్ని ఇస్తోంది. సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు కలిగించని విధంగా కొత్త
వికేంద్రీకరణ బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వంటి సూపర్
కేపిటల్ మోడల్ రాజధాని వల్ల అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి నోచుకోవనే బలమైన
అభిప్రాయం వైఎస్ జగన్‌లో ఉందని, మొదటి నుంచి ఆయన వికేంద్రీకరణకే కట్టుబడి
ఉన్నారని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
త్వరలో మంత్రివర్గ సమావేశం]..
త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని
సమాచారం. ఈ నెల రెండోవారంలో మంత్రివర్గాన్ని సమావేశపరుస్తారని అంటున్నారు.
ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో- విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి
వీలుగా ముహూర్తాన్ని కూడా ఇదే కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం ఉంటుందని
చెబుతున్నారు. ఉగాది నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో
ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో..
మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని వైఎస్
జగన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై
సుప్రీంకోర్టు మధ్యంతర స్టే జారీ చేయడం, కేంద్రం నుంచి కూడా పెద్దగా
అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం వంటి అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల జాప్యం
చేయకుండా సభలో బిల్లును ఆమోదించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
దీనికోసం ఈ నెలలోనే సభను సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, సుప్రీం
కోర్టులో కేసు విచారణలో ఉన్నందున న్యాయపరమైన చిక్కుల గురించి న్యాయనిపుణుల
అభిప్రాయాలు తీసుకుని అందుకనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్లవచ్చునని
పరిశీలకులు భావిస్తున్నారు.