‘ఇద్దరు డిప్యూటీ సీఎంలలో ఎవరైనా సరే.. వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి
తీసుకొస్తే సీఎం పదవి ఇస్తా’నని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓపెన్
ఆఫర్ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అఖిలేష్
యాదవ్ తాజా వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నేత ఆజం ఖాన్‌ను అధికార బీజేపీ అక్రమ
కేసులతో వేధిస్తోందని అఖిలేష్ ఆరోపించారు. ప్రస్తుతం యూపీ సీఎంగా యోగి
ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కొనసాగుతున్నారు. ఈ
నేపథ్యంలో అఖిలేష్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అఖిలేష్ మాట్లాడుతూ
‘‘యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వాళ్లు సీఎం అయ్యేందుకు అవకాశం కోసం
ఎదురు చూస్తున్నారు. వారికి ఒక ఆఫర్ ఇస్తున్నాం. వంద మంది ఎమ్మెల్యేలను
తీసుకురండి. మీతో మేముంటాం. మీలో ఎవరు వంద మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే
వారిని సీఎం చేస్తాం’’ అని ప్రకటించారు.