పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష అరుదైన ఘనత
సాధించనున్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు.
ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా నిలవనున్నారు. ఐఓఏ సంఘానికి ప్రస్తుతం
ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ఆదివారమే నామినేషన్లకు తుది గడువు. కాగా,
ఇందులో అధ్యక్ష పదవికి పీటీ ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేష్ల
ప్రక్రియ పూర్తి కావడం.. పీటీ ఉష మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో
ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో ఐఓఏ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా
పీటీ ఉష నిలుస్తారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళా
పీటీ ఉషనే. అలాగే మహరాజా యాదవేంద్ర సింగ్ తర్వాత ఈ పదవి చేపట్టనున్న తొలి
క్రీడాకారిణిగా కూడా ఉష నిలవనున్నారు. అయితే, అసోసియేషన్‌కు సంబంధించి మిగతా
పదవులకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పోస్టులకు మొత్తం 24 మంది
నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అందులో పీటీ ఉష టీమ్ నుంచి 14 మంది
నామినేషన్ వేశారు. ఇక ఐఓఏ ఉపాధ్యక్ష పదవి (పురుషుల విభాగం) కోసం మాజీ షూటర్
గగన్ నారంగ్ ఒక్కడే నామినేషన్ వేశారు.