ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో అమెరికా
చేతిలో ఇరాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. సాధారణంగా తమ జట్టు మ్యాచ్ ఓడిపోతే
ఆ దేశస్థులు నిరాశ చెందుతారు. కానీ, అందుకు భిన్నంగా సొంత జట్టు
ఓటమిపాలవ్వడంతో ఇరాన్లో సంబరాలు జరుపుకుంటున్నారు. వందలాది సంఖ్యలో
ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్‌లో
ఉత్సాహంతో డ్యాన్లు కూడా చేశారు. ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇరాన్ జాతీయ
జట్టుపై యునైటెడ్ స్టేట్స్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో దేశంలో అత్యధిక
కుర్దిష్ జనాభా ఉన్న కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లో అభిమానులు వీధుల్లోకి
వచ్చారు. పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని బుకాన్ ప్రాంతంలో వారు బాణాసంచా
కూడా పేల్చారు.
ఇరాన్ లో హిజాబ్ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ జట్టు
ప్రపంచకప్‌లో పాల్గొనడాన్ని ఖండిస్తున్నారు. ఆందోళనతో ఓవైపు జనం చనిపోతుంటే
ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లడం అవసరమా అని జనం
అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంతోనే ఇన్ని రోజులు రోడ్లపై ఆందోళనలు చేసిన
ప్రజలు.. ఇప్పుడు ఆనందంతో వీధుల్లో చిందులేస్తున్నారు.