భారత స్టార్, అనుభవజ్ఞుడైన టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్‌కు ఈ ఏడాది మేజర్
ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఈ ఏడాది ఈ అవార్డు అందుకున్న ఏకైక
ఆటగాడిగా అతను నిలిచాడు. వీరితో పాటు 25 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు
ఎంపిక చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులు,
కోచ్‌లను సన్మానించారు. అచంట్ శరత్ కమల్‌తో పాటు 25 మంది క్రీడాకారులను అర్జున
అవార్డుతో సత్కరించారు. ఈ 25 మంది ఆటగాళ్లలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం
గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, బాక్సింగ్
ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణం గెలుచుకున్ననిఖత్ జరీన్, కామన్వెల్త్ గేమ్స్
మెడల్ గెలుచుకున్న జూడోకా సుశీల కుమారి, బాక్సర్ పంఘల్, టేబుల్ టెన్నిస్
ప్లేయర్ శ్రీజ ఆకుల, అథ్లెట్ అవినాష్ ఉన్నారు. ఇదిలాఉండగా, క్రీడా అవార్డులు
సాధారణంగా ఆగస్టు 28న ఇస్తారు. హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజు
సందర్భంగా ఆగస్టు 28న క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కామన్వెల్త్
క్రీడల కారణంగా ఈ ఏడాది అవార్డుల ప్రదానం ఆలస్యమైంది.