మద్యం తాగి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్
నమోదు చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ధర్మవీర్ అనే
అనుమానితుడిని వారు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలు
పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 11వ తేదీ సాయంత్రం తాము ఒక క్లబ్లో
కలుసుకున్నామని, అక్కడ ధర్మవీర్ తనకు కూల్ డ్రింక్ ఇచ్చాడని తెలిపింది.
వెంటనే తాను మైకంలోకి వెళ్లినట్లు బాధితురాలు వాపోయింది. తనను ఇంటికి
తీసుకువెళ్లమని నేను అభ్యర్థించినప్పటికీ, అతను రాత్రి హోటల్ లోనే ఉండాలని
సూచించాడని పేర్కొంది. క్లబ్లో పనిచేసే స్నేహితుడి సాయంతో తాము ఒక హోటల్లోకి
ప్రవేశించామని అక్కడ అతను తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన
ఫిర్యాదులో పేర్కొంది.