లక్నో: ఉత్తర్ప్రదేశ్ బహ్రాయిచ్లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం
జరిగింది. తప్పే సిపా సమీపంలో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును
ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా
గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరందరిని స్థానిక ఆస్పత్రికి
తరలించారు. బస్సు జైపూర్ నుంచి బహ్రాయిచ్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ
విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల
కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం
అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.