ప్రపంచ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఈసారి మొరాకో ఆ అద్భుత ప్రదర్శన చేసింది.
తొలి పోరులో.. గత వరల్డ్ కప్ రన్నరప్ క్రొయేషియాను గోల్స్ లేకుండా
నిలువరించిన మొరాకో..మరోసారి అదరగొట్టింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’
మ్యాచ్‌లో 22వ ర్యాంకర్ మొరాకో 2-0తో ఏకంగా నెం.2 బెల్జియానికి షాకిచ్చింది.
ద్వితీయార్థంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు అబ్దుల్ హమీద్ సబీరి (73),
అబోఖలాల్ (90+2) చేసిన గోల్స్‌తో మొరాకో అమోఘ విజయం అందుకుంది. దాంతో నాలుగు
పాయింట్లతో మొరాకో నాకౌట్ ఆశలను మెరుగుపరుచుకుంది. గ్రూపు ఆఖరి మ్యాచ్‌లో
కెనడాతో మొరాకో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ పరాజయంతో 2018 సెమీఫైనలిస్ట్
బెల్జియం గ్రూప్ దశనుంచే నిష్క్రమించే దుస్థితి ఏర్పడింది. బెల్జియం ఆఖరి
పోటీలో క్రొయేషియాను ఢీకొనాల్సి ఉంది. ఇక..మ్యాచ్ ఆరంభంనుంచే దూకుడు
ప్రదర్శించిన మొరాకోకు 35వ నిమిషంలో గోల్‌కొట్టే అవకాశం లభించింది. బెల్జియం
డిఫెండర్లను తప్పించుకొని బాక్సు కుడివైపు నుంచి హకీమీ కొట్టిన షాట్
గోల్‌పోస్ట్ ఆవలగా వెళ్లింది. కానీ పట్టువదలని ఆ జట్టు ద్వితీయార్థంలో మరింత
విజృంభించి ఏకంగా రెండు గోల్స్ చేసి పటిష్ఠమైన బెల్జియాన్ని దెబ్బ తీసింది.