టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాది ప్రపంచ
రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని
నరేంద్రమోదీ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో
రుతురాజ్ చెలరేగిపోయాడు. శివసింగ్ బౌలింగ్‌లో వరుసగా ఏడు సిక్సర్లు బాదాడు.
దీంతో ఆ ఓవర్లో ఏకంగా 43 పరుగులు లభించాయి. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్
స్టాండ్స్‌లోకి పంపాడు. నోబాల్ అయిన ఐదో బంతి కూడా సిక్స్ కొట్టాడు. దీంతో
అదనంగా లభించిన ఫ్రీహిట్ బంతితోపాటు చివరి బంతిని కూడా సిక్సర్లుగా మలిచాడు.
దీంతో ఆ ఓవర్లో రుతురాజ్ ఏకంగా 42 పరుగులు పిండుకున్నాడు. నో బాల్‌కు లభించిన
పరుగుతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్లో ఏఢు
సిక్సర్లు బాదిన రుతురాజ్.. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ
రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 159 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 10
ఫోర్లు, 16 సిక్సర్లతో అజేయంగా 220 పరుగులు చేశాడు. అతడి బాదుడుతో మహారాష్ట్ర
నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. కాగా, 16
సిక్సర్లు బాదిన గైక్వాడ్ లిస్ట్ ఎ మ్యాచ్‌లో 16 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ
రికార్డును అందుకున్నాడు.