▪వికేంద్రీకరణపై ఇక ముందడుగే
▪మూడు రాజధానుల ఏర్పాటు.. మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం
-మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సుప్రీం కోర్టు తీర్పు
తెలుగుదేశం పార్టీ కి చెంపపెట్టు అని వైసీపీ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.
విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కాలువపల్లి లో గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
వికేంద్రీకరణ పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు
చెప్పారు.రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర
ప్రభుత్వానిదే అనే విషయం సుప్రీం తీర్పుతో బలపడిందన్నారు.కోర్టు తీర్పు తోనైనా
చంద్రబాబుకు కనువిప్పు కలగాలన్నారు.అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు
పాల్పడి, చంద్రబాబు తన పార్టీ నేతలతో భూములు కొనిపించి, భావి తరాలకు అన్యాయం
చేసేలా వ్యవహరించారన్నారు.అంతే కాక రియల్టర్లు, పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు
అమరావతి యాత్ర చేయించారని విమర్శించారు. బాబు ఇకనైనా ప్రజలను రెచ్చగొట్టి మూడు
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. వికేంద్రీకరణే
తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతమని, ప్రాంతీయ అసమానతలు లేకుండా
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి
చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూడు రాజధానులు ఏర్పాటైతే వెనుకబడిన
ప్రాంతమైన రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దన్న,
సర్పంచ్ ఎమ్ డి పెద్దన్నతదితరులు పాల్గొన్నారు.