దేశంలో జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా నిరసనలను కవర్ చేస్తున్న చైనాలో
బిబిసి జర్నలిస్టును నిర్బంధించడంపై బ్రిటన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం
చేసింది. జర్నలిస్టు నిర్బంధం సరికాదని, అది ఏమాత్రం “ఆమోదయోగ్యం కాదు” అని
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రతినిధి ఎడ్ లారెన్స్ సోమవారం
పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో మాత్రమే చైనాను తమ ప్రభుత్వం ప్రశ్నిస్తోందని,
ఇతర సమస్యలపై ఆ దేశంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగిస్తుందని ఆ ప్రతినిధి
చెప్పారు. “మేము స్పష్టమైన, నిర్మాణాత్మక సంబంధాల్లో భాగంగా అన్ని స్థాయిల్లో
చైనా ప్రభుత్వంతో మా మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తడం కొనసాగిస్తాము” అని ఆయన
చెప్పారు. “ఈ జర్నలిస్ట్‌ను అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరమైనది, ఆమోదయోగ్యం
కాదు” అన్నారు. జర్నలిస్టులు బెదిరింపులకు భయపడకుండా తమ విధులను
నిర్వర్తించగలగాలని పిలుపునిచ్చారు.