ఉక్రెయిన్-రష్యా యుద్ధం సమయంలో అఖిలేశ్ గుప్తా తన బిడ్డను అక్రమంగా భారత్ కు
తీసుకొచ్చాడంటూ ఢిల్లీ హైకోర్టును స్నిజానా గుప్తా ఆశ్రయించింది. మూడేళ్ల
కొడుకు కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన
కోర్టు.. తండ్రీకొడుకుల ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో
రెండ్రోజుల క్రితం తండ్రిని పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. కొడుకు
అనారోగ్యంతో ఉన్నాడని, తదుపరి విచారణకు హాజరుపరుస్తామని గుప్తా కోర్టుకు
వివరించాడు. తల్లి స్నిజానా ఉక్రెయిన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
విచారణకు హాజరైంది. అనువాదకుడి ద్వారా కొడుకు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది.
యుద్ధంలో తాను చనిపోయానని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని మోసగించి, కొడుకును
భారత్ తీసుకెళ్లాడని ఆరోపిస్తోందామె. తప్పుడు పత్రాలు సృష్టించి భారత
ప్రభుత్వాన్ని మోసగించాడంటోంది. ఇవాళ చేపట్టనున్న విచారణకు తల్లి స్నిజానా
నేరుగా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే యుద్ధం నేపథ్యంలో చిన్నారిని తల్లికి
అప్పగించడం క్షేమమేనా అన్న మీ మాంసలో ఢిల్లీ హైకోర్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
క్రమంలో నేటి విచారణ ఆసక్తికరంగా మారనుంది.