అమెరికా, దాని మిత్రదేశాలకు అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామంటూ ఉత్తర కొరియా
అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన
అణు దళాన్నిరూపొందించడమే తన లక్ష్యమని కిమ్ ప్రకటించారు. ఈ మేరకు కొరియాకు
చెందిన మీడియా పలు విషయాలను వెల్లడించింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్
ఉన్ ఇటీవల కొత్త బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంలో నిమగ్నమై ఉన్నవందలాది మంది
సైనిక కమాండర్లకు పదోన్నతి కల్పించారని ఆ మీడియా వెల్లడించింది. తమ దేశం
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ శక్తిని కలిగి ఉండాలని
ఆకాంక్షిస్తున్నట్లు కొరియా మీడియా ఆదివారం పేర్కొంది. నవంబర్ 18న కిమ్ ఉత్తర
కొరియాలో అత్యంత బరువైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) హ్వాసాంగ్-17
పరీక్షను పరిశీలించారు. తాజాగా జరిపిన ఈ ఖండాంతర క్షిపణి పరీక్షను కిమ్ తన
భార్య, కూతురితో కలిసి వీక్షించారు. ‘‘శత్రువులు ఇలాగే బెదిరింపులకు పాల్పడితే
అణుదాడికి అణ్వాయుధాలతో, ఘర్షణలకు ఘర్షణలతోనే సమాధానం చెబుతామని కిమ్ జోంగ్
ఉన్ తెలిపారు’’ అని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది.