వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర దిన (రిపబ్లిక్ డే) వేడుకలకు అరబ్
రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి ముఖ్య అతిథిగా
హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్ డే ఉత్సవాలకు
హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత
రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే
తొలిసారి కావడం విశేషం. భారత్-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా
స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై
75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు
జరుపుకున్నాయి. ప్రతి ఏడాదీ భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య
అతిథిగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.