ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమెరికన్ లెజెండరీ
నటుడు బ్రూస్ లీ అతి చిన్న వయసులోనే చనిపోయిన విషయం తెలిసిందే. 1973 జులైలో
తన 32వ ఏట సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో ఆయన మరణించాడు. అయితే ఆయన మృతికి
సంబంధించి తాజాగా విస్తుగొలిపే విషయాలు బయటికొచ్చాయి. అతిగా నీళ్లు తాగడం
వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం
వెల్లడించింది. బ్రూస్ లీ మరణించిన దాదాపు 50 సంవత్సరాల తర్వాత వైద్యులు ఈ
విషయాలను వెల్లడించారు. 1973 వేసవిలో హాంకాంగ్‌లో మరణించినప్పుడు లీ వయస్సు 32
సంవత్సరాలు.
ఆయన శవపరీక్ష నివేదిక ప్రకారం … ఎంటర్ ది డ్రాగన్ స్టార్ పెయిన్ కిల్లర్
వల్ల మెదడు విస్తరించి మరణించినట్లు అప్పట్లో వెల్లడించారు. కానీ, హైపోనామియా
వల్లే బ్రూస్ లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు
తాజా అధ్యయనంలో వెల్లడించారు. అతిగా నీరు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం
స్థాయిలు కరిగిపోవడాన్ని హైపోనాట్రేమియాగా వ్యవహరిస్తారు. సోడియం స్థాయుల్లో
సమతుల్యత లోపించి శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులోని కణాలు వాపు చెందాయని,
అదే అతడి మరణానికి దారితీసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.