బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు
విక్రమ్ గోఖలే (77) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొద్ది
రోజులుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం పుణెలోని
దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరగా, శనివారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస
విడిచినట్లు డాక్టర్లు వెల్లడించారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన
పర్వానా(1971) సినిమాతో విక్రమ్ గోఖలే సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 40
ఏళ్ల పాటు ఆయన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. మరాఠీలో ఆయన
స్వీయ దర్శకత్వంలో నటించిన అనుమతి(2013) చిత్రానికి గాను ఆయన జాతీయ ఉత్తమ
నటుడి అవార్డు అందుకున్నారు. కాగా, కొద్ది రోజులుగా విక్రమ్ గోఖలే
మృతిచెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా, వాటిని కుటుంబ సభ్యులు ఇటీవల
ఖండించారు. అయితే ఇంతలోనే ఆయన మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన
అభిమానులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు.