కర్ణాటకలో ఓటర్ల డేటా చౌర్యం జరిగిందని, ఓటర్ల జాబితా నుంచి దాదాపు 27 లక్షల
మంది ఓటర్లను తొలగించారని వచ్చిన ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది.
ఓటర్ల డేటా చౌర్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రతినిధి
బృందం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ రెండు అంశాలు ఇటీవల రాష్ట్రంలో
పెను దుమారం రేపాయి. సీఈసీ, ఈసీలతో భేటీ అనంతరం బుధవారం ఏఐసీసీ ప్రధాన
కార్యదర్శి ఇన్ చార్జి రణదీప్ సూర్జేవాలా, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్
మాట్లాడుతూ.. ‘ఓటర్ డేటా చోరీ’ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. దీనిపై విచారణ
జరుపుతామని ఈసీ తమకు తెలియజేసిందని చెప్పారు. ఇదిలా ఉండగా, శనివారం ఇద్దరు
జిల్లా ఎన్నికల అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఓటర్ల జాబితా తొలగింపులు,
మార్పులపై అధ్యయనం చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే అవకతవకలకు పాల్పడిన
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీబీఎంపీ చీఫ్ కమిషనర్, ఎన్నికల అధికారులపై
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.