హైదరాబాద్ : బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో ఈనెల 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని
బీఎల్ సంతోష్‌కు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ
చేసింది. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు.
ముందుగా నిర్ణయించుకున్న కొన్ని సమావేశాల కారణంగా సిట్ విచారణకు రాలేకపోయారని
సంతోష్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు, రాష్ట్ర
ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషన్లో
పేర్కొన్నారు. ఈ కేసు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధంలేదని, సీఆర్పీసీ 41ఏ
నోటీసు రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కేసును అత్యవసరంగా విచారణ
జరపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు
సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ
చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.