అమరావతి : ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదులు
ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్
బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేశ్ బదిలీ సరికాదన్నారు. ఈ మేరకు హైకోర్టులో
విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల
బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి
బదిలీని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు
న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం
సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్,
మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరి చొప్పున న్యాయమూర్తులున్నారు. తెలంగాణ
హైకోర్టు నుంచి జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్
డాక్టర్ డి.నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ ఏ.అభిషేక్‌రెడ్డిని
పట్నా హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ బట్టు దేవానంద్‌ను
మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేష్‌ను అలహాబాద్ హైకోర్టుకు, మద్రాస్
హైకోర్టు నుంచి జస్టిస్ వి.ఎం.వేలుమణిని కలకత్తా హైకోర్టుకు, జస్టిస్
టి.రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన
విషయం తెలిసిందే.