అమరావతి : భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును
విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి
భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ
సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ
20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం
వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో
200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ
సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా
కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం,
వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి
పని చేయడం ద్వారా ప్రపంచ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన
వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం.