పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించండి
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం
విజయవాడ : ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని
పునరుజ్జీవింపజేసేందుకు ఏఐసీసీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను
ఇవ్వాలంటే బడుగు, బలహీనవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎఐసిసి
మెంబర్, యంబిసి మెంబర్ కొలనుకొండ శివాజీ అన్నారు. తాజాగా పార్టీ అధిష్టానం
విడుదల చేసిన నియామక కమిటీ పట్ల కొలనుకొండ శివాజీ అసంతృప్తి వ్యక్తం
చేస్తూ గాంధీనగర్‌లోని తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం
చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధిష్టానానికి తెలియజేసేందుకు వివిధ
అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కొలనుకొండ శివాజీ ఏఐసీసీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి వేణుగోపాల్‌కు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపించారు. వినతి
పత్రంలో పేర్కొన్న అంశాలను ఆయన విలేకరులకు వివరించారు. కొలనుకొండ
శివాజీ స్పందిస్తూ నేను గత 40 సంవత్సరాలు నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టీ
పరంగా కీలకమైన పదవులు నిర్వహించాను. యం.బి.సి., నేతగా కూడా వున్నాను. 2004
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి ఎపిసిసి కార్యవర్గంలో అనేక మంది పిసిసి
ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ముఖ్య అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ వరకు అన్ని
పదవులు నిర్వహించాను. పార్టీ నాయకుడిగా, యంబిసి నాయకుడిగా ప్రజల్లోను, ప్రచార
సాధనాల్లోను గుర్తింపు కలిగివున్నాను. దిగ్విజయ్ సింగ్ వంటి నాయకులు కూడా
నన్ను వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలుస్తారు. పార్టీకి నా పూర్తి సమయాన్ని
కేటాయించేవాడిని. ఈ కమిటీలో నా పేరు ఎక్కడా లేకపోవడం ఆశ్ఛర్యానికి, ఆవేదనకు
గురిచేసింది. రాయలసీమ నుంచి ఉత్తరాంద్ర వరకు రాష్ట్ర అగ్ర నాయకత్వానికి నా
సామర్ధం మీద పూర్తి నమ్మకం, విశ్వాసం వుంది. వారికి నా కెపాసిటీ, క్యాపబులిటి
తెలుసు. గడచిన 40 ఏళ్ళుగా పార్టీ కోసం చాలా డబ్బలు ఖర్చుపెట్టాను. ఇప్పటికీ
కాంగ్రెస్ పార్టీలోనే వున్నాను. రాహుల్‌గాంధీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం
వున్నవాడిని. తాజాగా విడుదల చేసిన కొత్త కమిటి విషయాన్ని పరిశీలిస్తే మొత్తం
53 మంది నియామకాలలో 50శాతం పదవులు ఓసిలకు ఇచ్చారు, వాళ్ళకు ఈ కమిటీలో దక్కిన
పదవులు 25, ఎస్సీలకు 19, బిసిలకు 5, మైనార్టీలకు 4 ఇచ్చారు. బి.సి.ల
మనాభావాలను, అగణద్రొక్కుతుంది, కో-ఆర్డినేషన్ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ,
క్యాంపెయిన్ కమిటీ, ప్రోగామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, మీడియా, సోషల్ మీడియా
కమిటీ, వర్కింగ్ ప్రెసిడెంట్లలో 20శాతం నియమాకాల్లో బీసీలు ఉండేలా చర్యలు
తీసుకోవాలని మనవి చేస్తున్నా అంటూ కొలనుకొండ శివాజీ పార్టీ అధిష్టానానికి
పంపిన వినతి పత్రంలో పేర్కొన్నారు.