ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగబోయే శాసనమండలి పట్టభద్రుల,
ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 8,99,280 మంది, రెండు ఉపాధ్యాయ
నియోజకవర్గాల పరిధిలో 43,170 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల నియోజకవర్గాలకు
975, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 348 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా వివరాలు తెలిపారు. ముసాయిదా జాబితాపై
డిసెంబరు 9వ తేదీ వరకూ అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారు. అర్హులై ఉండి
ఓటర్ల జాబితాలో పేరు లేనివారు కూడా ఈ గడువు తేదీలోగా ఓటుహక్కుకు దరఖాస్తు
చేసుకోవచ్చు. డిసెంబరు 30న తుది జాబితా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీలు
వై.శ్రీనివాసులరెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం, కత్తి
నరసింహారెడ్డి, పీవీఎన్ మాధవ్‌ల పదవీకాలం 2023 మార్చి 29తో ముగియనుంది. ఈ
నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.