వెలగపూడి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో జరిగిన
చోరీ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
పి.కె.మిశ్రా ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన
దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు
వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన
నివేదిక ఆధారంగా హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. కేసును
సీబీఐకి అప్పగించినా తమకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) గతంలో ఉన్నత
న్యాయస్థానానికి తెలిపారు. అప్పట్లో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాణి
గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తిరిగి గురువారం మళ్లీ
విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం
తీసుకుంది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న
ఫోర్జరీ, మోసం, తప్పుడు పత్రాల సృష్టి కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు
నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురయ్యాయి. ఈ ఏడాది
ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.