బలవంతపు మత మార్పిడులతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భారత
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. బలవంతపు మత మార్పిడులపై
కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన
పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అశ్విని
ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్
హిమా కోహ్లీ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు
కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘బలవంతపు మత మార్పిడులు తీవ్రంగా పరిగణించాల్సిన
అంశం. దీనివల్ల దేశ భద్రతకే కాకుండా మత స్వేచ్ఛ, నైతిక అంశాలకు కూడా ముప్పు
వాటిల్లే అవకాశం ఉంది. ఈ అంశం మరింత తీవ్రంగా మారకముందే కేంద్రం తన వైఖరి
స్పష్టం చేయాల్సి ఉంది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా తమ మతాన్ని
ఎంచుకునే హక్కు ఉంది. అయితే, బలవంతంగా మత మార్పిడి చేయడం సరికాదు’’ అని
సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కేంద్రం తన వైఖరి ఏంటో స్పష్టం
చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు
చేయాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.