దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ, ఆప్
పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్
జైలులో ఉంటూ బయటి ఆహారం తింటున్న వీడియో ను బీజేపీ నాయకులు విడుదల చేశారు.
అయితే అవి ఫేక్ వీడియోలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
మనీష్ సిసోడియా బుధవారం వెల్లడించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్
ఎన్నికల్లో (ఎంసీడీ) ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఉందని సిసోడియా పేర్కొన్నారు.
ఆప్ ఎందుకు రక్షణాత్మకంగా వ్యవహరిస్తోందని అడిగిన విలేకరుల ప్రశ్నకు సిసోడియా
స్పందిస్తూ “సత్యేందర్ జైన్ పట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి ప్రేమా లేదు. జైలు
నుంచి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన వీడియో.. బయటి ఆహారం తింటున్నదృశ్యం ఆమ్
ఆద్మీ పార్టీపై బిజెపి నుంచి దాడులను ప్రేరేపించాయి”. అని సమాధానమిచ్చాడు.