గోవర్ధన రెడ్డి
నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామాల్లో ప్రజలకు
త్రాగునీటి సదుపాయం కల్పించుటకు 193 పనులకు 80 కోట్ల రూపాయల నిధులు
మంజూరైనట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు
పంచాయతీ పరిధిలో 8వ రోజు శ్రీనివాసపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి స్థానిక ప్రజలు ఘన
స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు
పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. అనంతరం మంత్రి
గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పారదర్శకత
పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల
ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలు వలన
నేడు అర్హులైన ప్రతి కుటుంబం నెలకు 15 వేల రూపాయల నుండి 20వేల వరకు లబ్ధి
పొందుతున్నారని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్నీ
గ్రామాల్లో ప్రతి ఇంటికి త్రాగునీటి సదుపాయం కల్పించుటకు 193 పనులకు 80 కోట్ల
రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్నీ
గ్రామాల్లో సమగ్రంగా ప్రజలకు అవసరమైన త్రాగునీరు, సాగునీరు, విద్యుత్, రోడ్లు,
సైడు కాలువలు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు మంత్రి గోవర్ధన్
తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుబ్బారాయుడు, జడ్పిటిసీ తెనాలి నిర్మలమ్మ,
తహశీల్దార్ ప్రసాద్, సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, స్థానిక నాయకులు, సచివాలయ
సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.