విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్
కల్యాణ్ మిన్నకుండిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రభుత్వ
వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం
లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
రాష్ట్రంలో పొత్తులపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్
ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా, వైకాపా కలిసే
పనిచేస్తున్నాయని, బీజేపీ, వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే అందరూ కలిసి
రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా టీడీపీ జనసేన, వామపక్ష
పార్టీలు కలిసి వెళ్లాలని సూచించారు. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి మేలు
జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.