వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభించిన జగన్
రాబోయే 15 రోజుల్లో ఈ 2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి
శ్రీకాకుళం : రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతో భూముల సర్వే జరుగుతోందని
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. భూ హక్కు
పత్రాలను అందించే మహత్తర కార్యక్రమం ఇదని చెప్పారు. రాష్ట్రంలో అత్యాధునిక
సాంకేతికతో భూముల సర్వే జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. భూ హక్కు పత్రాలను
అందించే మహత్తర కార్యక్రమం ఇది అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో
‘జగనన్న భూహక్కు – భూరక్ష’ పథకం రెండోదశను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా
నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని భూములన్నీ కొలతలు
వేసే కార్యక్రమమిది. మహాయజ్ఞంలా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. మొదటి దశలో
రాష్ట్రంలోని 2వేల గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తాం. రెండో దశ
2023 ఫిబ్రవరి నాటికి మరో 4వేల గ్రామాల్లో, మూడో దశలో 2023 మే నాటికి 6వేల
గ్రామాల్లో, నాలుగో దశలో ఆగస్టు నాటికి 9వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు
అందజేస్తాం. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ
ప్రక్రియ పూర్తిచేస్తాం. ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తున్నాం.
అన్ని రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ
కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీంతో భూములు
ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు సాఫీగా
జరుగుతాయి. రైతుల భాగస్వామ్యం, సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో
భూముల అమ్మకాలు, కొనుగోళ్లు గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా నిర్ణయం
తీసుకున్నాం. మంచి జరిగితే అండగా నిలబడండి. నేను నమ్ముకున్నది ప్రజలు, దేవుడి
దయనే. ప్రతి ఇంటికీ మంచి జరిగిందా? లేదా? అనేదే కొలమానంగా పెట్టుకోండి.
ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని జగన్ సూచించారు. వంద సంవత్సరాల
తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో భాగంగా శ్రీకాకుళం
జిల్లా నరసన్నపేటలో 2 వేల గ్రామాల్లో రైతులకు నేటి నుంచి 15 రోజుల పాటు
అందజేసే జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్.జగన్
మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాససనభ స్పీకర్ తమ్మినేని
సీతారామ్, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, పలువురు
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు,
ఉన్నతాధికారులు హాజరయ్యారు.