ఢిల్లీ మంత్రి, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సత్యేందర్ జైన్ (58) మనీలాండరింగ్
ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ మే 30న
అరెస్టు చెేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే
సత్యేందర్ జైన్ కు జైలులో రాజభోగాలు అందుతున్నాయంటూ బీజేపీ కొన్నాళ్లుగా
ఆరోపిస్తోంది. జైలులో ఆయన బాడీ మసాజ్ చేయించుకుంటున్నవీడియోలను బీజేపీ తాజాగా
విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అంశం రాజకీయ వర్గాల్లో
హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియోలను షేర్ చేసి మరీ బీజేపీ నేతలు విమర్శలు
గుప్పిస్తున్నారు. ఇదిలాఉండగా, మంత్రి సత్యేందర్ మంగళవారం ట్రయల్ కోర్టు
ఎదుట హాజరయ్యారు. తనకు తగినంత ఆహారం, వైద్య పరీక్షలు లేకపోవడం వల్ల తాను 28
కిలోగ్రాములు (సుమారు 62 పౌండ్లు) తగ్గినట్లు పేర్కొన్నాడు. ప్రజలకు రహస్య
సమాచారాన్ని వెల్లడించడం ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఆదేశాలను
ఉల్లంఘించిందని సత్యేందర్ జైన్ తరపు సీనియర్ న్యాయవాది రాహుల్
మెహ్రా పేర్కొన్నారు.