హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి నేటి
తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో మల్లారెడ్డి ఐటీ అధికారులకు
విషయాన్ని వెల్లడించారు. ఐటీ రైడ్స్ కొనసాగుతుండగానే కుమారుడిని సూరారంలోని
నారాయణ హృదయాలయకు మంత్రి మల్లారెడ్డి తరలించారు. ఆసుపత్రి వద్దకు టీఆర్ఎస్
శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. కాగా మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో
రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ
కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ, ఆస్పత్రి ఇతర వ్యాపార
సంస్థలపై సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల ముందు నుంచే తనిఖీలకు
అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దాడుల విషయాన్ని ఐటీ శాఖ గోప్యంగా ఉంచింది.
కాగా ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ
కక్ష్యతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి
మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న
మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. అయితే ఐటీ
అధికారులు మల్లారెడ్డిని ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు.