డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్
అహ్మదాబాద్ : వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం
1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 182 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో
డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండో దశ పోలింగ్‌కు
సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. తొలి దశలో 89
స్థానాలకు 788 మంది, రెండో దశలో 93 స్థానాలకు గానూ 833 మంది పోటీలో
నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.