శాన్ఫ్రాన్సిస్కో: ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గూగుల్
మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా 10,000 మందికి ఉద్వాసన పలికేందుకు కసరత్తు
ప్రారంభించింది. అంటే, కంపెనీ మొత్తం సిబ్బంది 1,87,000 మందిలో 6 శాతం మందిని
బయటికి పంపనుంది. పనితీరు పేలవంగా ఉన్న ఉద్యోగులను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి
తొలగించనుందని తెలిసింది. అయితే, ఈ విషయంపై ఆల్ఫాబెట్ అధికారికంగా
స్పందించాల్సి ఉంది. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలైన మెటా (ఫేస్బుక్,
వాట్సప్ మాతృసంస్థ), అమెజాన్, ట్విటర్, సేల్స్ఫోర్స్ ఇప్పటికే భారీ
సంఖ్యలో తీసివేతలకు పాల్పడ్డాయి. వ్యాపార సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే
ప్రణాళికలో భాగంగా ఉద్యోగాల కోతలుంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదివరకే
సంకేతాలిచ్చారు. ఇప్పటికే కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపివేసిన సంస్థ
పనితీరును మెరుగుపర్చుకోవాలని, అంచనాలను అందుకోలేనివారు ఉద్యోగంపై ఆశ లు
వదులుకోవాలని ప్రస్తుత సిబ్బందిని హెచ్చరించింది