తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో
రోజైన మంగళవారం రాత్రి సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి
అమ్మవారు భక్తులకు కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా
మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో
భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా
భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సింహం
పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా
సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి
అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు
గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్,
చిన్న జీయ్యంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు చెవిరెడ్డి
భాస్కర్ రెడ్డి దంపతులు, జెఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ
లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, విఎస్వోలు మనోహర్, బాలి
రెడ్డి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి , ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్
మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.