తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ
ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక,
సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుచానూరు ఆస్థానమండపంలో
ఉదయం 5 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ మునిరత్నం, శ్రీ చంద్రశేఖర్
బృందం మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం
అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు బెంగళూరుకు
చెందిన శ్రీమతి జానకి ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల
వరకు బెంగళూరుకు చెందిన అన్విత బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం
జరిగింది. అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తెనాలికి చెందిన
శ్రీమతి శారద భాగవతార్ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6.30
గంటల వరకు తిరుపతికి చెందిన లావణ్య, శ్రీ రఘునాథ్ బృందం అన్నమయ్య
సంకీర్తనలను గానం చేశారు. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో
సాయంత్రం 6.30 గంటల నుండి బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం భక్తి
సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరువూరుకు చెందిన
శ్రీ నరసింహారావు బృందం సంగీతం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఎస్వీ సంగీత
నృత్య కళాశాల నాదస్వరము మరియు డోలు ప్రవీణ విద్యార్థులచే వాద్య సంగీత
కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం
6.30 నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే వాద్య సంగీత
కార్యక్రమాలు నిర్వహించారు.