మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం లభించింది. చిత్ర రంగానికి ఆయన
అందించిన సేవలకుగానూ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ 2022 అవార్డు వరించింది.
తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (Iffi 53)
కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ పురస్కారాన్ని
ప్రకటించారు. తాజాగా చిరంజీవికి ఈ పురస్కారం రావడంపై భారత ప్రధాని నరేంద్ర
మోదీ స్పందించారు. ట్విట్టర్లో మోదీ చేసిన పోస్ట్‌లో.. ‘చిరంజీవిగారిని
ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన పని, వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన స్వభావం
తరతరాలుగా సినీ ప్రేమికులకు ఆయన వైపు ఆకర్షించేలా చేస్తున్నాయి. ఇండియన్
ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నందుకు ఆయనకు అభినందనలు’ అని
రాసుకొచ్చారు. మోదీ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి ఆయన పోస్ట్‌కి
చిరంజీవి రిప్లై ఇచ్చారు.