తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు మసాజ్ చేయడంపై బీజేపీ, ఆప్
నేతల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. ఆప్ నేతల అధికార దుర్వినియోగానికి ఇది
పరాకాష్ట అని బీజేపీ విమర్శించింది. అయితే దానికి ఆప్ కౌంటర్ ఇంచ్చింది. రెండు
సర్జరీలు జరిగిన పేషంట్‌కు డాక్టర్ల సలహా ప్రకారం ఫిజియోథెరపీ చేస్తే దానిని
వీడియో తీసి బీజేపీ నేతలు ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించడం సిగ్గుచేటని ఆప్
విమర్శించింది. సీఎం కేజ్రీవాల్ అండ తోనే సత్యేంద్రజైన్‌కు తీహార్ జైల్లో
రాచమర్యాదలు లభిస్తున్నాయని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు. తీహార్
జైలు నుంచి సత్యేంద్రజైన్ వసూళ్ల రాకెట్ నడిపిస్తున్నారని ఆరోపించారు.
అయితే సత్యేంద్రజైన్‌పై బీజేపీ చేసిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించా రు. సోమవారం వడోద్రాలో ఆయన విలేకరులతో
మాట్లాడారు. జైల్లో ఉన్నపప్పుడే సత్యేంద్రజైన్‌కు రెండు సర్జరీలు జరిగాయని,
డాక్టర్ల సలహా మేరకు ఆయనకు జైల్లో ఫిజియోథెరపీ జరుగుతోందన్నారు. ఓ పేషంట్‌కు
జరుగుతున్న ఫిజియోథెరపీని కూడా వీడియో తీసి బీజేపీ ఎన్నికల్లో లబ్ది కోసం
వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెన్నెముకకు గాయం అయినందున ఫిజియోథెరపీ
తీసుకోవాలని వైద్యులు సూచించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి
చికిత్సకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని లీక్ చేయడం ద్వారా బీజేపీ మాత్రమే
క్రూరమైన జోకులు వేయగలదన్నారు. సత్యేందర్ జైన్ వెన్నెముక దెబ్బతిన్న విషయం
రికార్డుల్లో ఉందన్నారు.