నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 35వ డివిజన్ లో గడపగడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం పూర్తిచేసుకున్న సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీధర్ రెడ్డి 35వ డివిజన్, నీలగిరి సంగం వైసిపి నేతలు, కార్యకర్తలతో సమావేశం
నిర్వహించి వారితో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 35వ డివిజన్లో
డ్రైనేజీ కాలువలపై ప్రత్యేక దృష్టి సారించి, 46 లక్షల రూపాయల వ్యయంతో వారం
రోజుల్లో శంకుస్థాపన చేసి, 3 నెలల్లో పనులు పూర్తిచేస్తామని స్థానిక ప్రజలకు
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యకర్తలతో
ముఖాముఖి మాట్లాడినప్పుడు వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. నెల్లూరు రూరల్
ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాట్లాడుతూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నెల్లూరు రూరల్
కార్యాలయం అండగా ఉంటుందని నేరుగా వచ్చి తెలపవచ్చని లేదంటే ఫోన్ ద్వారా 24
గంటలు అందుబాటులో ఉంటామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ
ఇచ్చారు. కార్యక్రమం అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బందితో
కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అల్పాహార విందు చేశారు. పై కార్యక్రమంలో
నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, 35వ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి
వాసంతి, డివిజన్ అధ్యక్షులు యాకసిరి శరత్ చంద్ర, స్థానిక వైసీపీ నాయకులు
తదితరులు పాల్గొన్నారు.