ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు హత్య చేసి, 35 ముక్కలుగా
చేసి..పలు చోట్ల విసిరేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ
బెంగాల్లోనూ ఈ తరహా దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రి గొంతు నులిమి చంపేసిన ఓ
కుమారుడు.. ఆపై తల్లి సాయంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని పలు
ప్రదేశాల్లో విసిరేశాడు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరూయ్పుర్ పరిధిలో ఈ ఘటన
చోటుచేసుకుంది.నేవీ రిటైర్డ్ ఉద్యోగిని అతని భార్య, కుమారుడు కలిసి గొంతుకోసి
హత్య చేశారు. మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన
షాకింగ్ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హత్యకు గురైన వ్యక్తి ఉజ్జల్ చక్రవర్తి
(54)గా గుర్తించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్ నివాసి. గతంలో
నేవీలో పనిచేసి 2000లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. అయితే, నవంబర్ 14న ఉజ్జల్
చక్రవర్తిని అతని భార్య, కొడుకు ఇంట్లోనే హత్య చేశారు. దీన్ని
కప్పిపుచ్చేందుకు, మరుసటి రోజు ఉజ్జల్ చక్రవర్తి అదృశ్యమైనట్లు అతని భార్య,
కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి వారి
స్టైల్ లో విచారణ చేపట్టగా నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉజ్జల్
చక్రవర్తి మద్యం సేవించి భార్య, కొడుకుతో గొడవపడేవాడని చెప్పారు..గత సోమవారం
అంటే నవంబర్ 14న అతను ఇంట్లో నానా హంగామా చేశాడు. ఈ కారణంగా కొడుకు కోపంతో
చక్రవర్తిని నెట్టాడు. కింద పడిన చక్రవర్తిని తల్లి, కొడుకు గొంతుకోసి హత్య
చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ పుష్ప తెలిపారు. ఉజ్జల్ చక్రవర్తిని హత్య
చేసిన తల్లీకొడుకులు మరో ఖతర్నాక్ ప్లాన్ వేశారు. మృతదేహాన్ని ఇంటి నుంచి
బయటకు తీసుకెళ్లేందుకు ఆయుధాలతో ఆరు ముక్కలుగా నరికి వేశారు. మృతదేహం ముక్కలను
సైకిల్‌పై తరలించి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసుల విచారణలో
వెల్లడైందని ఎస్పీ తెలిపారు.