ఫుట్‌బాల్ ప్రేమికుల పండుగ సాకర్‌కు ముందు ట్విటర్‌కు దెబ్బ మీద దెబ్బ
పడుతోంది. ఫిఫా వరల్డ్ కప్ సమయంలో దిగ్గజ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్
ట్విటర్లో క్షణాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. గత
వరల్డ్‌కప్‌ల సమయంలో.. యూజర్ల ట్రాఫిక్ ప్రవాహంతో ట్విటర్ డౌన్ అవ్వకుండా
ఇంజనీర్లు రేయింబవళ్లు కష్టపడ్డారు. కానీ, ఆ సంస్థను కొనుగోలు చేసిన ప్రపంచ
కుబేరుడు ఎలానమస్క్ ‘ట్విటర్ 2.0’లో సంస్కరణల పేరుతో ఉద్యోగాల కోతతో పాటు
పనిగంటలను పెంచేశారు. దీంతో.. శుక్రవారం 1,200 మంది ఇంజనీర్లు రాజీనామా
చేశారు. సాకర్ నేపథ్యంలో మస్క్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. ‘‘ఉన్నఫళంగా
శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయానికి రండి. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా
రిపోర్ట్ చేయండి’’ అని ఇంజనీర్లందరికీ మెయిల్స్ పంపారు. శుక్రవారం మస్క్
ట్విటర్ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇకపై విద్వేషపూరిత ట్వీట్లకు
ట్విటర్లో తావుండదని స్పష్టం చేశారు. అలాంటి ట్వీట్లను వెనువెంటనే
తొలగిస్తామన్నారు.