జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అమరావతి : అఖిల భారత యాదవ మహా సభ ఆధ్వర్యంలో యాదవుల కార్తీక మాస వనభోజన
కార్యక్రమాన్ని నిర్వహించారు. కె.పి.హెచ్.బి. కాలనీలోని గోవర్ధనగిరి కృష్ణ
దేవాలయంలో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్
అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. యాదవ మహా సభ ఆధ్వర్యంలో ఇలాంటి
కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అందరినీ కలుపుకుని వెళ్లి..
సమూహం మంచి కోసం పోరాడేలా సంఘటితం చేయడం ఎంతో మంచి విషయమని అన్నారు. యాదవులు
ఒకప్పుడు రాజ్యాలను ఏలారని చెప్పుకుంటూ ఉన్నామని, ఇప్పుడు మాత్రం ఆ దిశగా
ఎందుకు అడుగులు వేయడం లేదో ఒక్కసారి ఆలోచించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు
దుండ్ర కుమారస్వామి అన్నారు. గోవులను పూజించడమే కాక సూర్య చంద్రులు
వున్నంతవరకు చెరగని చరిత్ర యాదవులది.. యుగ యుగాలకు తరగని కీర్తి యాదవులది.
ఎటువంటి కష్టం వచ్చినా వెనుకకు తగ్గని యోధులు యాదవులు. కానీ ఇప్పుడు యాదవులు
రాజ్యాధికారానికి దూరంగా ఉండడం శోచనీయం. అగ్ర కులాలకు చెందిన నాయకుల కోసం
జెండాలు భుజాన వేసుకుని వాళ్ళ పల్లకీలు మోసుకుంటూ వెళుతున్న యాదవులలో రాజకీయ
చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. యాదవులంటే
కేవలం పశువులకు కాపాలాగా ఉండే వారు మాత్రమే కాదు. ఎండనకా-వానననకా..
పగలనక-రేయనక ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఎంతో తెగించి అడవుల్లో కూడా ఎంతో
ధైర్యంగా తమ పశువులను క్రూర మృగాల నుండి కాపాడే ధైర్యవంతులు యాదవులని, రాజకీయం
అనే చదరంగంలో ఇప్పుడు బలిపశువులుగా మారారు తప్పితే అధికారమనే సింహాసనంలో
మాత్రం కూర్చోలేకపోతున్నారని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
యాదవులకు మహాభారతానికి ఉన్నంత చరిత్ర ఉన్నదని, దీనిని నేటి తరం తెలుసుకుని
సంఘటితంగా ముందుకు సాగాలని దుండ్ర కుమారస్వామి పిలుపును ఇచ్చారు. ఐక్యత
ద్వారానే యాదవుల అభివృద్ధి అన్నది జరుగుతుంది.. యాదవులు ఐక్యంగా ఉండడం వల్లే
అభివృద్ధి చెందుతారని, పాండవుల పక్షాన ధర్మం, న్యాయం ఉండటం వల్లనే
శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డారని, యాదవులు కూడ శ్రీకృష్ణుని మార్గంలో
పయనించి దేశం, సమాజం కోసం ధర్మం పక్షాన నిలబడుతున్నారని దుండ్ర కుమారస్వామి
అన్నారు. అయితే అధికారానికి మాత్రం దూరంగా ఉంటున్నారని బాధను వ్యక్తపరిచారు.
అప్పట్లో కణ్వ మహర్షి పెట్టిన శాపం యాదవులను ఇంకా వెంటాడుతోందేమో అనే భయం కూడా
తనకు ఉందని, ఇకనైనా యాదవుల్లో రాజకీయ చైతన్యం కలిగి, గొప్ప పదవుల్లోకి
వెళ్లాలని ఆశిస్తూ ఉన్నానని అన్నారు దుండ్ర కుమారస్వామి. క్రమంలో ముఖ్య
అతిథులుగా మాజీ జడ్జ్ అల్లం రాజయ్య మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర
కుమారస్వామి , ప్రభాకర్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు రమణ, వెంకటయ్య
వెంకటేశ్వర్లు ,గిరి, తదితరులు ఆపాల్గోన్నారు.