ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్
మిగిలుండగానే సొంతం చేసుకుంది. శనివారం సిడ్నీలో జరిగిన రెండో వన్డేలో
సమష్టిగా రాణించిన ఆసీస్ 72 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. దాంతో మూడు
మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 280
పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(114 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 94) మరోసారి
రాణించగా.. మార్నస్ లబుషేన్(55 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58) మిచెల్
మార్ష్(59 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50)హాఫ్ సెంచరీలతో మెరిశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, డేవిడ్
విల్లే రెండేసి వికెట్లు పడగొట్టారు. మోయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు. లక్ష్య
ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 38.5 ఓవర్లలో 8 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం
చవిచూసింది. జేమ్స్ విన్స్(72 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), సామ్
బిల్లింగ్స్(80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) మినహా అంతా విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా..
జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ కెప్టెన్
జోస్ బట్లర్ దూరంగా ఉండగా.. మోయిన్ అలీ జట్టును నడిపించాడు. ఆస్ట్రేలియాలో
కూడా ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. హజెల్ వుడ్ సారథ్యం వహించాడు.
ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
అవార్డు లభించింది.