ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా అర్జెంటీనా, యూఏఈ మధ్య సన్నాహక మ్యాచ్ జరిగింది.
బుధవారం జరిగిన ఈ వార్మప్ మ్యాచ్లో యూఏఈని అర్జెంటీనా 5-0తో ఏకపక్షంగా
ఓడించింది. ఏంజెల్ డి మారియా, అల్వారెజ్, మెస్సీ, జోక్విన్ కొరియా గోల్స్
చేశారు. మ్యాచ్లో ఆరంభం నుంచే అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించింది. 17వ
నిమిషంలో మెస్సీ పాస్లో జూలియన్ అర్వరాజ్ అద్భుత గోల్ చేశాడు. దీని తర్వాత,
డి మారియా రెండు బ్యాక్ టు బ్యాక్ గోల్స్ చేశాడు. మెస్సీ కూడా హాఫ్ టైం కంటే
ముందే ఖాతా తెరిచాడు. దీంతో హాఫ్ టైం సమయానికి అర్జెంటీనా 4-0తో ఆధిక్యంలో
నిలిచింది. రెండో అర్ధభాగంలో జోక్విన్ కొరియా 60వ నిమిషంలో గోల్ చేసి 5-0తో
ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అర్జెంటీనా బలమైన జట్టుగా
పేరుంది. గత 36 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.