జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు
కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
అలీ మహ్మద్ మాగ్రే అనంత్‌నాగ్‌లోని దక్షిణ జిల్లా హార్డ్కిచురో గ్రామానికి
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ మాజీ
ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై రిజిజు స్పందించారు. కేంద్ర
ఎన్నికల సంఘం (EC) స్వతంత్ర సంస్థ అని.. ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోదని
అయన పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మాత్రమే ప్రభుత్వం అన్ని
రకాల సహాయం చేస్తుందని.. అంతేకానీ, మనం చెప్పిన విధంగా నడుచుకోదని స్పష్టం
చేశారు.
‘పాలనాపరంగా కేంద్ర ఎన్నికల సంఘం న్యాయశాఖకు జవాబుదారి. ఎన్నికల సంఘం
అనేది నిష్పక్షపాత, జవాబుదారీ కలిగిన స్వతంత్ర సంస్థ. ఎన్నికల సంఘం విషయంలో
కేంద్రం పాత్ర చాలా పరిమితం. కేవలం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను
మాత్రమే ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ సహాయం లేకుండా
న్యాయస్థానాలు లేదా ఇతర సంస్థలు కార్యకలాపాలు సాగించలేవు. వాటి కార్యకలాపాలు
సజావుగా సాగేందుకు అవసరమైన తోడ్పాటును మాత్రమే ఆ సంస్థలకు కేంద్రం
అందిస్తుంది. అంతేకానీ, ప్రభుత్వం చెప్పినట్లు వారిని ఆడించలేం’ అని కిరణ్
రిజిజు ఉద్ఘాటించారు.