పోలాండ్ పై రష్యా చేసిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ప్రస్తుతం
పెను ఆందోళనలకు దారి తీస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో
బైడెన్ బాలిలో G-7,NATO ఆత్యయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్స్కీ..రష్యాపై ఆరోపణలు చేశారు. యుద్ధ వాతావరణాన్ని మరింత
సంక్లిష్టం చేసేందుకే రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.
రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాటో దేశాలు రష్యాపై
కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. రష్యా ఉగ్రవాదం కేవలం తమ దేశానికే పరిమితం
కావడం లేదని, మిగతా దేశాల్లోనూ అలజడి రేపుతోందని ఆరోపించారు. నాటో దేశమైన
పోలాండ్‌పై దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడు
జో బైడెన్‌తో పాటు, జెలెన్స్కీ…పోలాండ్ అధ్యక్షుడు ఆండ్ర్జెజ్ దుడతో
మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికే
రష్యా-ఉక్రెయిన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వైరం ఉంది. ఇలాంటి ఘటనలు..
పరిస్థితులు అదుపు తప్పుతాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.